STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ దుఃఖ దేహం

ఓ దుఃఖ దేహం

1 min
0



వాన కోసం వేచి ఉన్న 
మనల్ని తడుపుతూ 
చినుకులుగా వర్షించింది మేఘం

తడిచిన హృదయాలలో 
చిగురించిన ప్రేమ 
గుప్పెడు జ్ఞాపకాలతో పాటు 
కాసిన్ని గాయాల్ని కూడా 
కానుకగా ఇచ్చింది 

పక్షుల కువకువలుంటేనే 
కొమ్మకు జీవం ఉంటుందనే సత్యం 
తెలుసుకునే సరికే 
రెక్కలొచ్చిన పిల్లలు 
గూడును వదిలేసి 
దూర తీరాలకు ఎగిరిపోయారు 

ఎప్పుడూ నీడలా 
నన్ను అంటిపెట్టుకుని 
ఉండే నువ్వు కూడా 
మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయాక 
కలిసి నడిచిన దారులన్నీ 
ఒంటరితనంతో నన్ను కప్పుకున్నాయి 

ఏకాకిగా మిగిలిపోయాననే బాధను గుండె గదిలోనే అదిమిపట్టుకుని 
గాయాలను జ్ఞాపకాలుగా 
కలిపి కుట్టుకుంటూ 
దుఃఖదేహాన్ని మోసుకెళ్తున్నాను 

కొన్ని బంధాలు అవసరాల తక్కెడలో 
భారాన్ని తూకం వేసుకుంటూ దగ్గరవుతాయని 
కొన్ని ప్రేమలు శిశిరాలను మాత్రమే మోసుకొస్తాయని అర్థం చేసుకునేసరికే 
నా చుట్టూ కూడా చీకటి 
నెమ్మదిగా కమ్ముకుంది 

ఈ చీకటి ఏ క్షణంలో అయినా నన్ను తనలో కలిపేసుకుంటుందని 
తెలిసినా కానీ, 
పక్షుల కోసం ఎదురుచూస్తున్న 
ఒంటరి కొమ్మలా 
చెట్టుకు వేలాడుతున్నాను …



Rate this content
Log in

Similar telugu poem from Classics