STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నిశ్శబ్ద నరకం

నిశ్శబ్ద నరకం

1 min
0

నిశ్శబ్ద నరకం: ఒక సగటు మనిషి అంతరంగం"
కనుపాపల వెనుక సముద్రమంత కన్నీరున్నా..
బయట ప్రపంచానికి నేను ఎండిపోయిన ఎడారిని.
గుండె మీద కొండంత బరువున్నా..
గడప దాటితే నేను గాలిపటంలా నవ్వాలి.
అమ్మ కళ్ళలో ఆశ.. భార్య నమ్మకం.. పిల్లల నవ్వులు, వీటన్నింటి మధ్య నేను నలిగిపోతున్న 'నడ్డిపూస'ని.
ఇంట్లో గొడవలు.. బయట అప్పుల వేట.. ఉద్యోగంలో అవమానం,
నాకు చావు కూడా రాదు.. ఎందుకంటే
నేను చస్తే.. వీళ్లంతా అనాథలైపోతారని ఒక భయం!
"ఏమైంది?" అని అడిగే గొంతుక కావాలి, కానీ అందరూ "ఏది?" అని అడిగేవాళ్లే.
జీతం కావాలి.. సౌకర్యం కావాలి.. సంతోషం కావాలి,
కానీ నేను కావాలని.. నా మౌనం అర్థం కావాలని ఎవరికీ లేదు.
ఒంటరిగా చీకట్లో కూర్చుని ఏడుద్దామంటే..
ఆ కన్నీటి శబ్దం వింటే.. నా ఇల్లు కూలిపోతుందని భయం.
పగలు నవ్వుతూ గడిపే వేషధారణ,
రాత్రి దిండును తడిపే విషాద గాథ.
నేను మనిషినా? లేక అందరి అవసరాలు తీర్చే కామధేనువునా?
నా ప్రాణం పోతున్నా.. పరుగెత్తక తప్పదు,
నా ఆత్మ చస్తున్నా.. నటించక తప్పదు.
ఓ దేవుడా..
నేను మోస్తున్న ఈ సిలువను ఎప్పుడు దించుతావు?
నా కన్నీటికి.. నా కష్టానికి.. ఏదైనా విలువ ఉందా?
లేక.. ఈ నిశ్శబ్ద నరకమే నా జీవితాంతం తోడా?


Rate this content
Log in

Similar telugu poem from Classics