బందిఖానా
బందిఖానా
మనసే మనిషికి బంధిఖానా
పెనవేసుకున్న పాశాల ఖజానా
చేసిన బాసలకు తలవొగ్గే క్షణాలు
కత్తి మీద సామే తీరవలసిన వాగ్దానాలు
మనిషి జీవితమే ఓ ఆరాటం
మనసుతో సంధి పొసగక పోరాటం
అడ్డు గోడలుగా నిలిచే బంధాలు
మనస్సాక్షికి తాకట్టు పెట్టినా
చెల్లించాలి మూల్యం
తనకు తానుగా విధించుకునే ఖైదు
బాధ్యతల చట్రంలో బంధీ అయిపోతూ
మనసును తూట్లు పొడిచే మాటలు
యమపాశమై వెంటాడి వేధిస్తుంటాయి
కంటికి కనపడని ఈ కటకటాలు
బతికినంత కాలం జీవిత శిక్షా స్మృతిలో
భారీ మూల్యం చెల్లించాల్సిందే
బరువుగా యాత్ర కొనసాగించాల్సి
