పురిటి భాష
పురిటి భాష
ఊహకు ఊపిరి నా తెలుగు భాష!
ఆలోచనలు అద్దం అమ్మ భాష!
ఆలోచన క్రమంలొ వారధి మాతృభాష!
పరాయి పలుకులు ఎన్ని ఉన్నా
పురిటి భాషకు సాటి రావుగా!
ఉపాధి గీతలు అని ఎన్ని పుట్టుకొచ్చినా
ఊపిరిలో ఐక్యం మన తెలుగు భాష!
దేహం దైవంగా పలికే భాష!
మాతృభాష నా జన్మ భాష!
ఉయ్యాలలో ఉసులు నేర్పింది తానే!
ఊహ వచ్చాక ఉపాధి తానే!
పెదాలు పలికే పదాల తేనె!
మనసు భాష నా తెలుగు భాష,!!
