STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

బాగున్నవి

బాగున్నవి

1 min
0



కనికరించు నవమల్లిక..సిగ్గులెంతొ బాగున్నవి..!
 చెలి వాలిన రెప్పలింటి..కబురులెంతొ బాగున్నవి..! 

విరహాగ్నిని కాల్చాలని..చూచుగాలి వెర్రిది కద.. 
చెలి చెక్కుల సిందూరపు..నిగ్గులెంతొ బాగున్నవి..! 

చూపలేని తాపమేదొ..మరిగించే అలజడిలో.. 
చెలివాడని తలపులింటి..ఊసులెంతొ బాగున్నవి..!

నిద్దురతో కలహించే..కాలమేల కరిగేనో.. 
చెలిఅడుగుల వెన్నంటిన..నిప్పులెంతొ బాగున్నవి..!

పెదవివిప్పి పలకరించి..చెప్పదగిన పనేమిటో.. 
లేఖలలో చేరలేని..పలుకులెంతొ బాగున్నవి..! 

లోలోపల పొంగుతున్న..వలపుతేనె రాగమేదొ.. 
పాడరాని భావనలకు..స్వరములెంతొ బాగున్నవి..!


Rate this content
Log in

Similar telugu poem from Classics