STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కొన్ని సార్లు

కొన్ని సార్లు

1 min
0



తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలి.
మౌనగా ఉండిపోవాలి.
ఏవో ఆలోచనల్లో తడిసిపోవాలి.
నిద్ర లేని రాత్రులు గడపాలి.

చావు చూసినంతా బాధను భరించాలి.
ఉన్నాలేనట్లు గడపాలి కాలం.
ఎన్నో నిందలు మోయాలి.
ఎన్నో మాటలు చెవిన పడ్డ కుమిలిపోవాలి.

కొట్టు మిట్టాడాలి అనునిత్యం.
దహించే మంటల్లో మాడిపోవాలి.
తుపాను బీభత్సం లో అల్లకల్లోలమైపోవాలి.
సముద్రపు అలల నడుమ చిక్కుకున్నా.

ఇరుకు గదుల్లో శ్వాస అందని తీరుగా మారిపోయాను
చిమ్మ చీకట్లో నలిగిపోయాను.
తెలియని లోతులో దిగి దిక్కుతోచని
స్థితిలో ఉండిపోతున్నా.
అంతులేని కధ నాది 
అలసిపోయి ఆగిపోయాను మంచి చేసి..

             


Rate this content
Log in

Similar telugu poem from Classics