STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అనుకోని అతిథి

అనుకోని అతిథి

1 min
0



మన జీవితంలో అతిథులు ఆద్యంతం 
మనిషి బంధాలు గట్టిపడే ఉదంతం 
అతిథులు రాని గృహం మోడైన వృక్షం 
మంచి చెడుల్లేని మానవ సంబంధం

నేడు అతిథుల్లేక, రాక ఒకింత మృగ్యం 
ఎవరి జీవితాల్లో వారు నిత్యం బ్యుజీ, బ్యుజీ 
యాంత్రికంగా మారిన రోజువారి జీవితం 
పలుచబడుతున్న ఈ ఆతిథ్యపు ప్రపంచం 

నేడు రమ్మన్నా రానటువంటి చుట్టాలు
ఏదున్నా ఆన్లైన్ లేదా ఫోన్లతోనే చెట్టపట్టాలు
అలా ఎవరికీ రాకపోకలకు లేని సమయం 
ఏదున్నా ఓ చుక్క తెగిపడ్డట్లు ఆగమనం

అతిథి దేవో భవా ఓనాటి ఆర్యోక్తి, ఓ సూక్తి 
నిజంగా నేడది నిజమైతే బతుక్కు అనురక్తి 
అనుకోని అతిథి వచ్చినా పరమానందం 
అక్కున చేర్చుకొని ఆతిథ్యమిస్తే మహదానందం

ఒంటరి జీవితాలకు అనుకోని అతిథి పెన్నిధి 
ఓ ఓయాసిస్సులా దాహం తీర్చే సన్నిధి 
కష్ట సుఖాలు పంచుకునేందుకు ఓ నేస్తం 
కడుపారా నవ్వుకునేందుకు తోడైన హస్తం 

ఎపుడో మరిచిన పరిచయం ఎదురైతే
అనుకోని అతిథిలా అర్ధరాత్రి తలుపు తడితే 
సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే క్షణాలు 
పోయిన ప్రాణాలు తిరిగొచ్చిన దృశ్యాలు 

ఒకసారి అది స్మృతిలాగా నిలుస్తుంది 
పాత పాటలా హృదయంలో మోగుతుంది
మరొకసారి అది వేదనలా అనిపిస్తుంది 
నిశ్శబ్దంగా కూర్చుని కన్నీటిని తుడుస్తుంది !



Rate this content
Log in

Similar telugu poem from Classics