STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నెచ్చెలి

నెచ్చెలి

1 min
17


పాటకు రెక్కలు..పొదిగెను నెచ్చెలి..! 
మదినే ఊయల..చేసెను నెచ్చెలి..! 

కనులకు చిక్కని..రూపసి తానే.. 
వెన్నెల నదిలో..ముంచెను నెచ్చెలి..! 

తనువును నడిపే..మెదడుకు తోడై.. 
ప్రేమను జలముగ..నింపెను నెచ్చెలి..! 

తూచగ జాలని..చెలిమికి వారథి.. 
కలలకు రూపం..ఇచ్చెను నెచ్చెలి..! 

చెప్పదు పేరును..విప్పదు పెదవిని.. 
మౌనపు కోవెలె..చేర్చెను నెచ్చెలి..! 

జీవన రాగపు..స్వరాల మధురిమ.. 
భావన సాక్షిగ..నిలిచెను నెచ్చెలి..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics