STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఈ క్షణమే

ఈ క్షణమే

1 min
2

ఈ క్షణమే చివరిదైతే !

ఎవరికైనా చివరి క్షణాలు ఉద్విగ్నభరితాలు
మరీ ఈ క్షణమే చివరిదైతే, అది మరీ ప్రత్యేకం
జీవితంలో బతుకంతా ఒకటి, ఈ క్షణమొకటి
బతుకునంతా గిర్రున నెమరువేసుకునే క్షణం

జీవితంలో తీరని కోరికలు అనేకానేకం
అవి తీరాలనే ప్రతి మనిషికి ఓ సంకల్పం 
పోయేముందు అనుభవించాలనే తాపత్రయం 
తుదకు తీరితేనే ఈ ఆత్మ విముక్తి పరం

ఏమి, ఎంత చేసినా అమ్మ ఋణం తీరనిది
ఈ జన్మకు అమ్మకు, పుడమికి కృతజ్ఞతలు
తోడుండి బాసటగా నున్న వారికి ధన్యవాదాలు 
ఈ క్షణమే మనసారా ఆశీర్వదించమని కోరుతా

నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపం ఫీలౌతా
మనసుకు కష్టపెట్టిన వారిని క్షమించమంట
నేను ఋుణపడ్డవారికి ఏదో కొంత ఇచ్చేస్తా
చివరి అవకాశంగా బాధా విముక్తున్నవుతా

అమితంగా ప్రేమించేవారికి ఆఖరి కౌగిలి
ముద్దు ముచ్చట్లతో చిట్ట చివరి వాక్యం 
అందరి మేలు కోరే నేను తుదకు మంచి మాట 
కళ్లారా కనువిందు అయ్యేలా ఆఖరి క్షణం 

తీరని కోరికలుంటే ఇక చాలనే లౌక్యం 
అనుభవించినకాడికి చాలు అదే భాగ్యం 
మనిషి జన్మ ఉత్కృష్టం కావున పదివేలు 
ఈ జన్మకు తృప్తి అయితే అవే వరహాలు

ఈ క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తాను
తప్పొప్పుల బేరీజు లేకుండా ఆనందిస్తాను
నలుగురిలో నడయాడిన నాకు తుది వీడ్కోలు 
భౌతికంగా లేకున్నా కీర్తి ప్రతిష్టలు వస్తే చాలు!!


Rate this content
Log in

Similar telugu poem from Classics