చెబుతున్నది
చెబుతున్నది
ఇది తియ్యని నాటకమని..నీ చూపే..చెబుతున్నది..!
ఇది వెచ్చని పొదరిల్లని..నీ సొగసే..చెబుతున్నది..!
అడుగడుగున పలకరించు..అక్షరాల వెన్నెల కద..
ఇది చక్కని కావ్యమ్మని..నీ తలపే చెబుతున్నది..!
నీవెంటే నడుస్తుంటె..పరవశించె నీడ కూడ..
ఇది వీడని బంధమ్మని..నీ ఊసే చెబుతున్నది..!
సుడిగాలుల కౌగిలింట..మురిసిపోవు గాలిపటం..
ఇది తరగని సౌఖ్యమ్మని..నీ మనసే చెబుతున్నది..!
స్నేహానికి శ్వాసలాగ..ఉందికదా నీ దారే..
ఇది చెరగని జ్ఞాపకమని..నీ వలపే చెబుతున్నది..!

