ప్రేమ పాల పుంత
ప్రేమ పాల పుంత
ఎలా తలచినా కల కాదు ఇది నిజమని కవితలో చెప్పిస్తావు
అలా మొదలైన నీ ధ్యాస, ధ్యానంలో కలువ పూలై వికసించే
కవితలెన్నో రాయిస్తావు నీతోనే మొదలైంది నా కవి ప్రస్థానం అంటే
నీటి బుడగలాంటి మాటతో నిట్టూర్పు మిగులుస్తావు
చుట్టూరా ఎంతోమంది వనితలున్నా
ఆకట్టుకోవటంలో నిన్ను మించిన నారి
నేను చేరింది లేదు వారి దరి తారసపడి మార్చింది లేదు నా దారి
అంతరంగ భావాలు అంతులేని విధంగా
అందమైన నీ రూపాన్ని వర్ణించాలని నిర్ణయించినపుడు
స్వర్ణ కమలం చిత్రంలో భానుప్రియలో నిన్ను చూసాను
నిర్ణయం సినిమాలో అమలలో నిను కాంచాను
ఇలా ఎందరిలో నిను తిలకించినా
తలకోన జలపాతం లాంటి నీ లావణ్యం ముందు
నిలువలేకున్నాయంటే నిజం కాదని నీవనుకుంటే
నాలో నిస్తేజం నింపిన వారు అవుతావే తప్ప
నీపై నాకున్న నికార్సయిన అభిమానాన్ని
అదుపు చేయలేవంటే అదొక వింతని నీకు అనిపించినా
అదే ప్రేమ పాల పుంతని నేననుకుంటాను....

