చంద్రిక
చంద్రిక
నీ తలపులన్ని నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవేళ
నిశ్శబ్ద వాతావరణంలో నా ఆలోచనలు
నీవైపుకు మళ్ళిన సమయాన ఏదో చిరు సవ్వడి
గుండెల్లో ఏదో అలజడి మనసులో తొలకరి కురిసి జల్లులు కురిసే
మనసులోని ఆశలు కొత్త చిగురు తొడిగినట్టుగా మానస వీణ పలికింది
మోముపై చిరునవ్వు విరిసింది
కనులు తెరిచి చూస్తే నువ్వు నా ముందు ప్రత్యక్షం నువ్వేనా
నా ఎదను మీటింది నువ్వేనా నాలో సరిగమల మధురిమలు పలికించింది. ఏదిఏమైనా
నీరాక నా మనసుకు శిశిరంలో విరిసిన వసంతం
నా హృదయానికి హేమంతంలో కురిసే తుషారం
నా కనులకు శరత్తులో విరబూసిన చంద్రిక

