నీ ప్రేమ
నీ ప్రేమ
నీ ప్రేమను తెలియలేని..బ్రతుకెందుకు అంటాను..!
నిన్ను గూర్చి పాడలేని..గళమెందుకు అంటాను..!
ఈ కన్నుల మెఱుపులలో..నీ చెలిమి దీపాలే..
మనసునిలిపి నిను చూడని..కనులెందుకు అంటాను..!
నా తలపుల గోరింటలు..పూయించే జాణవే..
పూజాసుమమై రాలని..వలపెందుకు అంటాను..!
నా భావనా గగనపు..ప్రణయాక్షర దీపికా..
మౌననిధికి మదిచేర్చని..ఊసెందుకు అంటాను..!
సమన్వయపు మధువునే..ప్రసాదించు కోమలీ..
ఆలోచన వీడలేని..పరుగెందుకు అంటాను..!

