STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

రాగమేదొ

రాగమేదొ

1 min
123


పాడ రాని రాగమేదొ గొంతు విప్ప చూస్తున్నది..!

భాష రాని భావమేదొ కవిత వ్రాయ చూస్తున్నది..!


ఇంద్రధనువు వర్ణాలకు వర్ణనేమి చేయగలం..!

తెలుపరాని విషయమేదొకలహమాడ చూస్తున్నది..!


జాబిలితో మాటలాడు పాపాయే కంటిపాప..!

పలుక రాని సంగతేదొ పాటపాడ చూస్తున్నది..!


చిత్రమైన కంటిచుక్క స్నేహమెంత చెక్కిలితో..!

చెరుప రాని బొమ్మఏదొ దాచిపెట్ట చూస్తున్నది..!


విరహాలకు ప్రేమలేఖ వ్రాస్తున్నది మేఘమాల..!

చదువ రాని పద్యమేదొ కురిసి మురియ చూస్తున్నది..!


 మందహాస చంద్రరేఖ ఆ యమునయె..!

ఇవ్వ రాని పుష్పమేదొ కాన్క చేయ చూస్తున్నది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance