అంతర్యుద్ధం
అంతర్యుద్ధం


మైమరపించే మది....!
మందలించే మతి....!
కోరికల నిలయం మది.....
కోట్ల ఆశయాలకి నిలయం మతి....
ఈ రెంటి మధ్య నలిగే మనిషి స్థితి ఓ చెప్పలేని అనుభూతి......
ఆహ్లాదం ఒకవైపు....ఆలోచన ఒకవైపు.....
ఆనందం ఒకవైపు .....హెచ్చరికలు ఒకవైపు.....
ప్రేమ కోరుకునే మదికి బాధ్యతలు గుర్తుచేసే శత్రువు మతి...
ఎగరాలి అనుకునే మదికి తన స్థోమత గుర్తచేసే ఆటంకం మతి.....
అందని ద్రాక్షని కోరుకునే మది.... అది నీకు అందదు అని నివారించే మతి...
శత్రువో.....హితుడో....బంధువో... తెలీదు కానీ మదికి ఎప్పుడు ఉండే తోడు నీడ రక్ష కేవలం మతి మాత్రమే......
యుద్ధం సహజం.....బాధ సహజం...కానీ ఆ యుద్ధం లో గెలుపు ఓటములు ఎన్నడూ మనం ఊహించలేం.....
మది .....మతి...ఈ
రెంటికి ఉన్న తారతమ్యం కేవలం ఒక్క అక్షరం కానీ వాటి మధ్య ఉండే విభేదాలు అసంఖ్యం...
మనిషి జీవితం లో జరిగే ప్రతి విషయం లో వీటి మధ్య ఒక యుద్ధం సర్వ సాధారణం.....ఆ యుద్ధం మంచి చెడులు మధ్యనా......కామ క్రోదాల మధ్యనా....ఆశ ఆవేశాల మద్యనా.... అనేది సమస్యా పరంగా జరిగే ప్రక్రియ...
ఇక విజయం ఎవరిది అనే ప్రశ్న....!???
అది మనిషికి ఉన్న బలా బలహీనతల మీద ఆధారపడిన తీర్పు....!!!
అసలు యుద్ధమే లేకుంటే మతి మది ఒకటే మాట మీదనే....ఉంటే....ఆహా....ఆ మనిషి జీవనం ఎంతో సుఖమయం....!!
కానీ ఈ అంతర్ యుద్ధం లో మనిషి చేసే సాధన శోధన....తను పడే తపన ...అర్థం కాని ఆవేదన.....రగులుతున్న ఒక అగ్ని పర్వతం...తో సమానం.....!!
అది ఆర్పేది కాదు ఆగేది కాదు....!!!
~~~~~~ మీ సూర్య