Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

జాగు

జాగు

1 min
416



జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు

జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు |2|


చ||

జాము రాతిరైన ఆనవాలే లేక ఆశొదలాల

గోముగా పిలిచినా పలుకవు నేనే కదలాల |2|

మందహాసం మరచి చంద్ర సాయం కోరానే

దరహాసంతో దరిచేరవా ఆ వెన్నెల తీరాన్నే

|ప|


చ||

ఆనలన్ని చేసి ఆనవాయితీ మరచితివి కద

ఊసులన్ని ఊహలతో నింపి పండెనే ఎద |2|

కోరికలే కొత్త ఆశలతో చివురులే తొడిగాయి

తారకలే తహ తహగా ఎపుడని అడిగాయి

|ప|


చ||

తొలి పలుకే తోరణమై తనువునెల్లా అల్లగా

మలి చూపులేక మదియే నీరసించే మెల్లగా |2|

వచ్చి వరద గోదారిల వలపించి గెలిపించు

నచ్చి నవపారిజాతంలా నను మురిపించు

|ప|


చ౹౹

చేర చెలిమి చిగురించునని ఆ వలపు కోరు 

చిరుహాసంతో ప్రేమకే చిరునామాగా మారు ౹2౹

కథలు మాని కదలరాద కలలతోనే నిండుగ

ఎదలు రెండు కలసిననాడే మనకి పండుగ ౹ప౹

 



Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance