నామదిని
నామదిని
చీకటిని మనసేమొ..మధుపమై గ్రోలింది..!
అరకనుల గదిలోన..ప్రాణమై వేచింది..!
నిదురతో పనిలేని..లోకమే తనదాయె..
పసిడి మల్లెలనడుమ..శిల్పమై పోయింది..!
పగడాల నగరిలో..పరువాల జాబిల్లి..
అపురూప భావనల..కావ్యమై విరిసింది..!
మురిపాల సంద్రాన..ముంచెత్తె నా మదిని..
నే వ్రాయు లేఖలో..మౌనమై నిండింది..!
ప్రతిరాత్రి తెలవారు..లోపెన్ని తమకాలొ..
గమకాల యమకాల..కాలమై నవ్వింది..!
సరసాల విరిబాల..సయ్యాట గాలితో..
నమకాల చమకాల..ప్రణవమై సాగింది.

