అనంతమైన ప్రేమ
అనంతమైన ప్రేమ
ఆమేపై నాకేంత ప్రేముందని
మాత్రం ప్రశ్నించోద్దు
పిల్లగాలి సైతం
తన ముంగురులను కదిల్చిన
నాలో ఎదో అలజడి కలుగుతుంది
వర్షపు చినుకులు సైతం
తన తనువును స్పృశించిన
నాలో ప్రళయం రేగుతుంది
సూర్యకిరణాలు సైతం
తన ముఖ సౌందర్యం పాలిపోయేటట్లు చేసిన
నాలో ఆందోళన మొదలవుతుంది

