STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసా

మనసా

1 min
218

శాశ్వతమే కాదని అశాశ్వతమే కొరులే మనసా

తరుల విరుల లా నీతనువు తీరులే ఓ మానసా


ఆదరాభి మానాలంటవ్ అక్కుచేర్చు కుంటావ్

అంతలోనే అక్కసు వెల్లి కక్కుతావే ఓ మానసా


మనసు కలతంటావ్ మనిషి నలతంటావ్! మది 

ముదర బెడతావ్ మాటబిగేసుకుంటావే మనసా


బంధన మంటావ్ బంధు గణమంటావ్ !బహు 

బాధంటావ్ భక్తితో భవుని వేడనంటావే మనసా


అన్నదమ్ములంటావ్ ఆలుబిడ్డలంటావ్! ఆసొదిలి 

ఛీఛీ పొమ్మంటావ్ అంతా నాదంటావే ఓ మనసా


సొమ్మేకూరుస్తావ్ సోకుసౌధాలు కడతావ్ స్వయం 

కృషి అంటావ్ సొమ్మసిల్లి పోతావే ఓ మనసా...


జిలుగు బట్టలంటావ్ జాలిదయలంటావ్!జీర్ణమే

లేక కర్ణమే వినపడక జీర్ణించి పోతావే మనసా..!!


          


Rate this content
Log in

Similar telugu poem from Romance