జీవితం
జీవితం
జీవితమంటే పూలబాట కాదోయ్
ముళ్ల బాటేనోయ్
జీవితమంటే పన్నీరు చల్లుతారనుకోకోయ్
కళ్ల నీటిని తెప్పిస్తారోయ్
జీవితమంటే మంది మార్భలం కాదోయ్
నిదురోయే నీ ఆత్మస్తైర్యమేనోయ్
జీవితమంటే కన్నీళ్లే కాదోయ్
ఆనందాల సంబరాలూ వున్నాయోయ్
జీవితమంటే పూలపాన్పు కాదోయ్
కటిక నేలపైనా నిదురోవాలోయ్
జీవితమంటే ఏదోలా గడిపేయొచ్చు అనుకోకోయ్
జీవితమంటే చెమట చిందిస్తే వచ్చే ప్రతిఫలమేనోయ్
చెమట చిందక వచ్చేది ఏదీ నిలవదోయ్
పరమార్థం ఒక్కటేనోయ్ శ్రమించు సాధించు
సహాయపడు విశ్రమించు మంచి మాట చెప్పానోయ్

