కాలమేఘము
కాలమేఘము
ఏ కాల మేఘమో నాపైన ఉరిమింది!
నా బ్రతుకు బొమ్మ పై చీకటిని ఒంపింది!
మనసు లో ఉప్పెన కి సాక్ష్య మే ఉండదులె
ఏ తలుపు తీసినా పెను లోయ మిగిలింది!
స్వప్నాల వాకిళ్ళు తెల బోయి చూస్తుంటె
నాలోని నీ రూపు వింతగా నవ్వింది!
కనులలో మేఘాలు వర్షించి నాయేమొ
కన్నీటి పడవలో మన ప్రేమ ఒరిగింది!
ఓడినా గెలిచినా గాయమే అందరికి
కథ లోని పాత్ర లని మధ్యలో మార్చింది!
ఏతార నడిగినా తన పేరు చెబుతుంది
జాబిలికి దగ్గరై అసూయని నింపింది!
ముద్దాయి నైనాను శిక్షించు తీయగా
ఈ బ్రతుకు నీ ప్రేమ ఉచ్చులో చిక్కింది!

