ప్రేమ లోకం
ప్రేమ లోకం
నీ కాటుక కనులు ఏనాడు చూశానో,
ఆనాడే నీ కనుల సంద్రాన్ని ఈదాలని తలచితిని,
నీ మనోహరమైన మోము నాలో మొహాన్ని పెంచె, ఇంతందం చూసి రంభ ఊర్వశి బ్రహ్మతో తగవులాడారు,
బ్రహ్మ ఇంత అందంగా చెక్కి నిన్ను,
ఎలా చేజార్చనో తెలీకున్నదీ,
నీ మేను తాకిన గాలికి కూడా ఊపిరి ఆడకున్నదీ,
నిన్ను ఎలా కమ్మెయాలో తెలియక,
చీకటి కూడా నిలువునా చిలెను,
నీ పాదస్పర్శ తాకి మట్టి పులకరించి పరవశించిపోయెను,
నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేని ముళ్లు,
దారి పొడవునా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకంటే,
నువ్వు తాకిన మంచు ముక్క,
కరగకూడదని తపస్సు చేసె పరమశివుడికి,
నీ పలుకులను విన్న కోకిల అసూయపడుతుంది,
ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందంతో,
నన్ను ప్రేమలోకి దింపిన నీవు,
నా ప్రేమలోకానికి పట్టపురాణివే ప్రియ సఖీ....!!!!

