జ్ఞాపకాల బాటలో
జ్ఞాపకాల బాటలో
జ్ఞాపకాల బాటలో పయనిస్తున్నా
చేదు జ్ఞాపకాలు కొన్ని తియ్యని
జ్జాపకాలు కొన్ని కలగలుపుగా
భారమైన మనసు చెదిరిన
కలలు సుదూర తీరంలో
చీకటి వెలుగుల సమ్మేళనం
గెలుపు ఓటమిల
నిరీక్షణలో కాలమిలా
సాగుతున్నది ఏదో
కావాలన్న తాపత్రయం
ఆశలు తీరాలన్న తపన
ఆశలన్నీ చెదిరిన స్వప్నాలే
కాలము సాగే కొలది
శిశిర కాలంలో రాలే ఆకుల్లా
రాలిపోతున్నాయీ జ్ఞాపకాలన్నీ
రావా వసంతమా మళ్మీ మునుపటి
రోజుల్లా కాలము వెనక్కి తిరిగేనా
కానీ గడిచిన క్షణము తిరిగి రాదని
అయినా ఆశ చావదు మనసున
చితికిన మనసు చెదిరిన కలలు
ఆశలు సుడి గుండంలో
కాలమే నిర్ణయిస్తుందని
వేచి చూడడమే

