ఎదలో దాగిన ప్రేమ
ఎదలో దాగిన ప్రేమ
ఎదలోన దాచినా కనులు చూపిస్తాయి
నా చెలియపైనున్న వలపు చూపిస్తాయి
మబ్బులో అందాన్ని కురులు చూపిస్తాయి
బంధించినప్పుడే నుదురు చూపిస్తాయి
ఆ కనులు నిండుపున్నమలకే పుట్టిళ్ళు
విడిచి వెళ్ళేటపుడు బెరుకు చూపిస్తాయి
చూపులను గుచ్చితే రంగు మార్చేస్తాయి
చెక్కిళ్ళు బిడియాల ఎరుపు చూపిస్తాయి
అలుకలో చేతులను తోసివేస్తుంటాయి
పాన్పుపై పాదాలు పొగరు చూపిస్తాయి
తన లేత పెదవులను ఓడించి పోలేవు
బాధలకు హాసాల పదును చూపిస్తాయి
రాత్రులను తీయనివి కోరితే
మనము కలిసే వేల కలలు చూపిస్తాయి

