నీ పరిచయం
నీ పరిచయం
నీ పరిచయంతో....
ప్రతీరోజు ఒక కొత్త అనుభూతి
నీ సముఖంలో
నిత్యం జనియిస్తున్నా సరికొత్తగా
నీతో మాటాడేందుకై
నిఘంటువు లో పదాలను వెతుకుతున్నా
నీతో ఉండేందుకై
అనుక్షణం తహతహలాడుతున్నా
నీవు లేని క్షణమొక యుగం
నీవు ఉన్న యుగమొక క్షణం
నవ్వులే రువ్వుతున్నావో..
నా ఎదలో వెన్నెలై అల్లుకున్నావో
చిత్రంగా నాలో నేను మాయమయ్యాను
నీలో నన్ను చూసుకున్నాను
విరించి రాసిన రాతలో ఏముందో...
నాకు నేను రాసుకున్న రాతవు నీవే..
ఉన్నన్నాళ్లు నీకు ఊపిరినౌతా...
ఆయువు నీవే..నాకు..
అంకితమౌతా నీకు....!!

