అందమైన పొదరిల్లు
అందమైన పొదరిల్లు
మనం అల్లుకున్నాము అన్యోన్యంగా
ఒక అందమైన పొదరిల్లు
అదే మనకు స్వర్గం
ప్రేమ పరిభాషల సంగమం
ఎన్నెన్నో ఊసుల సమ్మోహనం
అలక, కోపం, తాపం
అసూయ,పోట్లాట,,బాధ, సంతోషం
అన్నీ కలబోసిన అపూర్వ బంధం
ప్రణయం,మనిద్దరి కలయితో
మనమూహించిన మన ప్రతిరూపాలు
ఏరికోరి ఎంచుకున్న పేర్లు
ఎంతో తృప్తిగా గడుస్తోంది మన జీవనం
అరమరికలు లేని అనురాగల సరస సల్లాపం
మనకే మనకే సొంతం ఈ అందమైన అనుభవం

