STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

దూరమెంత..

దూరమెంత..

1 min
387

దూరమెంతో లేదులే ఆ దూకుడే తగ్గించవా

భారమెంతో కాదులే నా ప్రేమనూ నెగ్గించవా

అలకమాని ఆ అలసిన గుండెనే ఓదార్చవా

కులుకు చూపి కుందనాల చందనం చేర్చవా

దూరమెంతో లేదులే ఆ దూకుడే తగ్గించవా

భారమెంతో కాదులే నా ప్రేమనూ నెగ్గించవా


అడియాస అనుకోక అవసరమని గుర్తెరుగు

తడియారని పెదవుల తహతహని నేనెరుగు

పండిపోయే వలపు పండుగలా పరిఢవిల్లునే

ఉండిపోయే తలపు మరపించునే విరిజల్లునే

కొసరి ప్రేమను కోరికతో కలిపిన కొత్త రుచులే

ఉసురే తగలక మునుపే చూపవా షడ్రుచులే

దూరమెంతో లేదులే ఆ దూకుడూ తగ్గించవా

భారమెంతో కాదులే నా ప్రేమనూ నెగ్గించవా


కారణమే కావాలని అనకే కలిసి నడిచేందుకే

ప్రేమ రణమే చాలదా చేరి కలిపి నిలిచేందుకే

కారణమే కావాలని అనకే కలిసి నడిచేందుకే

ప్రేమ రణమే చాలదా చేరి కలిపి నిలిచేందుకే


దూరమెంతో లేదులే ఆ దూకుడే తగ్గించవా

భారమెంతో కాదులే నా ప్రేమనూ నెగ్గించవా

అలకమాని ఆ అలసిన గుండెనే ఓదార్చవా

కులుకు చూపి కుందనాల చందనం చేర్చవా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance