STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

కోయిలా రా యిలా..

కోయిలా రా యిలా..

1 min
379

కోయిలా రా.. యిలా మనసారా కూయను

పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను

మనసులో మౌనరాగమే మల్లెలై పల్లవించ

పనసలో తీయదనమే ఆలాపనై ప్రభవించ

కోయిలా రా.. యిలా మనసారా కూయను

పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను


 కూజితాలు కులాసాలే వంపినే నింపాదిగా

 కాగితాలే నింపినే కవులు కూడ అనాదిగా

 పూలే పున్నమి రెక్కలే తొడిగి చుక్కలాగా 

 భలే మెరిసే అక్కడే విరిసినా మొక్కలాగా

 హరివిల్లు కొత్త వర్ణాలనూ అద్దు కోవాలిగా

 చిరుజల్లు చిత్రంగా తనే మెచ్చు కోవాలిగా

 

కోయిలా రా.. యిలా మనసారా కూయను

పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను


వింత రాగం వీనులు విందు చేయసాగెను

పొంత చేరి వంతపాడనే ఉవ్విళ్ళే ఊగెను

తిధి వారం చూడకా తీయని గానాలాపం

అతిధిలా అడగకా వెలువరించే రాగదీపం


కోయిలా రా.. యిలా మనసారా కూయను

పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను

మనసులో మౌనరాగమే మల్లెలై పల్లవించ

పనసలో తీయదనమే ఆలాపనై ప్రభవించ

కోయిలా రా.. యిలా మనసారా కూయను


గతులు ఆ సంగతులే ఎక్కడ నేర్చినావోగా

మతులు పోగొట్టే మరపులూ పేర్చినావుగా

గతులు ఆ సంగతులే ఎక్కడ నేర్చినావోగా

మతులు పోగొట్టే మరపులూ పేర్చినావుగా

కోయిలా రా.. యిలా మనసారా కూయను

పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను

కోయిలా రా.... రా..యిలా....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance