మనసు మురిసే వేళలో
మనసు మురిసే వేళలో


"మంచు కురిసే వేళలో " పాటకు అనుసరణ
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
మరులు విరిసే మనసులో ఎద మురిసెనెందుకో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
మనసు మురిసే వేళలో....
నీవు పలికే పలుకులో, పల్లవించే వలపులో
నీవు పలికే పలుకులో, పల్లవించే వలపులో
సరసమాడి సంభవించే సంరంభంలో
పులకరించే తనువుతో పలకరించే అదనులో
పులకరించే తనువుతో పలకరించే అదనులో
ఎందుకా ఆరాటం ఎందుకో పోరాటం
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
మరులు విరిసే మనసులో ఎద మురిసెనెందుకో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
మనసు మురిసే వేళలో....
అలక సిగ్గు అధరంతో అందిన ముద్దు ఎపుడో
అలక సిగ్గు అధరంతో అందిన ముద్దు ఎపుడో
కామునితో కర్మ వైనం తెలిపినపుడో
తీరిపోని తృష్ణము తీరు తెలుసుకొనేదెపుడో
తీరిపోని తృష్ణము తీరు తెలుసుకొనేదెపుడో
తనువులో తడిమంటలే తల్లడిల్లినప్పుడో
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
మరులు విరిసే మనసులో ఎద మురిసెనెందుకో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
ఎందుకో ఏ వింతకో, ఎవరిని హత్తుకోనో
మనసు మురిసే వేళలో....