STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

భగభగ

భగభగ

1 min
3

భగభగ మండే నిప్పుకణం నీ లక్షణం

ఎగసిపడే ఆవేశం లావాలా నిరంతరం

చీకటి చీల్చే వేకువ కిరణం నీ అక్షరం

పూరించే విప్లవ శంఖం జ్వలించెనే అనుక్షణం

ఏ మూల చూసినా దౌర్జన్యం

సహించలేదు నీ నేత్రం

ఉప్పొంగే నీ రుధిరం

నీ అక్షరమే పాశుపతాస్త్రం

తలవంచక తప్పదు రక్కసి సైన్యం

పోరాటానికి నీ అస్త్రం సిద్ధం    

                         

సాయం అందని వ్యవసాయం నుండి

ఉదయించిదొక  ఉద్యమం

బానిస బతుకుల సంకెళ్ళు తెంచగా

కదిలిందొక విప్లవం

నీ లక్ష్యమే జన చైతన్యం

సాగించగా నువు అక్షర సేద్యం

వంచన పై మరణం ఎరుగని రణం 

                       

అణగారిన ఆశల శోకం నుండి

పెల్లుబికిందొక పోరాటం

దురాచార దుశ్చర్యలపై

మొదలైందొక యుద్ధం

నీ కలమే గర్జించే ప్రజాగళం

ఊపిరులూదే భావతరంగం

లిఖించదా చరిత్ర కనని సంచలనం  

                       


Rate this content
Log in

Similar telugu poem from Classics