STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
2

'హరీ!'శతకపద్యములు.


45.

చంపకమాల.


గరళము జిమ్ముచుండె నట కాళియు డాయమునా హ్రదంబులో 

నురగపు ధాటికిన్ హడలి యుస్సుర టంచును బ్రాణభీతితో

పరుగులు బెట్టుచుండి జనవాహిని వేడగ భీతిమాన్పగన్

సరుగున వచ్చితీవు ఘన సర్పపు గర్వము ద్రుంచగన్ హరీ!//


46.

చంపకమాల.


బలమగు సర్పమున్ దునిమి పాదము మోపి శిరంబుపై వెసన్

జెలగుచు నృత్యమున్ సలుప జీవము పోవునటంచు భీతితో

నలయుచు వేడగన్ శరణ మాఫణి యార్తిని బాపినావు నిన్ 

దలచిన చాలు పుణ్యమట!తల్చెద నిత్యము భక్తిగన్ హరీ!//



Rate this content
Log in

Similar telugu poem from Classics