STORYMIRROR

Keerthi purnima

Drama Inspirational Others

3  

Keerthi purnima

Drama Inspirational Others

ఎక్కడుందయ్య నా భారతం..?

ఎక్కడుందయ్య నా భారతం..?

1 min
285

పేదరికపు కోరల్లో కూరుకపోయింది

ఆకలి చావుల్లో మిలితమయింది

స్వతహాగా సృష్టించుకున్న కృత్యాలే

ప్రళయం గా మారి వెంటాడుతుంది..

చూడు...ఇకనైనా చూడు...

నీ కంటి పొరల పై దాగిన

మసక ముసుగు నీ తీసి చూడు..

పర దేశపు మోజు లో పడి...

నీ దేశాన్ని పాడు చేస్తున్నావు చూడు..

ప్రకృతిలో సహజంగా ఉండే

 పంచభూతాలను పొందడానికి కూడా 

అర్ధం చెల్లించి బతికే 

అర్ధం లేని బతుకు సారం గమనించావా

నోటి దాకా వచ్చిన కూడు చిక్కక చితి పాలైనట్టు

అభివృద్ధికై జరిగే పరుగుల పోరాటం లో


వింమొదటి నుంచి మరలా ప్రయత్నం 

మొదలయిందని గ్రహించావా

ఆర్ధిక విద్వాంసాలా ప్రళయం లో

పునరుజ్జీవనానికి ఆధ్యం అవ్వు....

లేదంటే నవ భారతం 

కావాల్సిందే అంతం....

గ్రహించు...గుర్తించు

నీ బాధ్యత వుందని

కష్టించూ....సహించు

నీ కర్తవ్యం నువ్వు సదా నిర్వర్తించు

దేశ ప్రగతి కి సోపానం అందించు


Rate this content
Log in

Similar telugu poem from Drama