STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
4

'హరీ!'శతకపద్యములు.


29.

చంపకమాల.


అదనుగ నేర్పగన్ జనుల కాత్మనిగూఢపరార్థతత్త్వమున్

ముదముగ జన్మ నొందితివి ముద్దుల బిడ్డగ గోకులంబునన్

యదుకుల దీప్తివై మునుల కాప్తుడవై చరియించితీవు నీ

పదములె దిక్కునాకు తనివారగ గొల్తు తరించగన్ హరీ!//


30.

ఉత్పలమాల.


 చక్కగ క్షీరమున్ గుడిచి జాణ నెఱింగి చెలంగి యాడుచున్ 

రక్కసి పూతనన్ దునిమి లావును జూపిన గోపబాలుడా!

మిక్కుట మైన ప్రేమమెయి మేలుగ దెచ్చితి భక్తి క్షీరమున్ 

 తక్కిడి సేయనయ్య!నను దగ్గర దీయుచు బ్రోవుమా హరీ!//



Rate this content
Log in

Similar telugu poem from Classics