STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Classics Inspirational

4.5  

Thorlapati Raju(రాజ్)

Drama Classics Inspirational

నిండు జాబిలి

నిండు జాబిలి

1 min
1.0K

మహిళా... ఓ మహిళా

నువ్వు లేని..మహి ఎలా?

అది ఊహకందని కల

నువ్వు మాత్రం....

మాటలకందని...అద్భుత కళ


సెలయేటి..గలగల

తారల...తళతళ

ఏవైనా...

మగువా నీ ముందు...విల విల


మహిళా...నువ్వొక ఎగసిపడే అల

వేయని వారుండరు...నీకు వల

ఎప్పుడు చిక్కుతావో... చేపలా

అని ఎదురు చూస్తూ ఉంటారు అలా


అందుకే... ఓ బాల మేఘ మాల

నీకు నువ్వే రక్షణ కవచం కావాలి..తాబేలు లా

నిత్యం ప్రకాశించాలి..సూర్య కాంతి లా

మాన ప్రాణాల జోలికొస్తే రగిలిపోవాలి..జ్వాల లా


ఆ రంగం..ఈ రంగం అని కాకుండా

ప్రతి రంగంలో అడుగు పెట్టిన ..అబల

అమ్మ లా..ఆలి లా..

అవసరమైతే..జాలి లేని అపర కాళీలా

కుటుంబ వ్యవస్థకు తోటమాలిలా

ఈ జగతి కి...చల్లటి వెలుగుని 

పంచవమ్మ.... నిండు జాబిల లా

         .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Drama