దేవుడా ఓ మంచి దేవుడా!
దేవుడా ఓ మంచి దేవుడా!
బంతి పూల బండి చేసి ఊరేగించనా
చామంతి పూల చాప చేసి పరుండ బెట్టనా
విరజాజులు తో విసనకర్ర చేసి గాలి విసరనా
జాజులతో మాల కట్టి జావళి పాడనా
కనకాంబరాల తో కార్పెట్ పరిచి నడిపించినా
గులాబి తో గజ్జెలు చేసి కాలికి తొడగనా
మందారాలతో మండపం కట్టి నిన్ను ఉంచనా
మల్లేలతో మాల కట్టి మత్తెక్కించనా
దేవుడా ఓ మంచి దేవుడా
ప్రాణం లేని నిన్ను మెప్పించేందుకు..
ప్రాణం ఉన్న వాటిని పణంగా పెడుతున్నాం
చలనం లేని నిన్ను సంతోష పెట్టేందుకు
చలనం ఉన్న వాటిని చంపేస్తున్నాం
ఆలోచన లేని నిన్ను ఆరాధించేందుకు
మా ఆలోచనలన్నీ అంకితం చేస్తున్నాం
కళ్లు లేని నీకు కనువిందు చేసేందుకు
మా కలలన్నీ కడలి పాలు చేస్తున్నాం
కానీ...
నువెక్కడ యెప్పుడూ...కానరాక...
నిన్ను కలవ లేక...
మనో నేత్రం కళ్ళు మూసుకు పోయి
ఆత్మ తోనే నిన్ను చూడగలం అని
మమ్ము అంతం చేసుకుంటున్న...
మెదడున్నది అనుకుంటున్న మహా మూర్ఖులం
దేవుడా.. ఓ మంచి దేవుడా
అంత్యంత అమానవీయంగ అత్యాచ
ారాలు చేసి
హత్యలు చేసి ఆనందిస్తూ ఉంటే ..
చూస్తూ ఉరుకున్నావా...లేక
ఏమి చేయలేనని తెలిసి కళ్ళు మూసుకున్నా వా
ఉన్న వాడు ఉన్నతంగా ఎదిగేందుకు
లేని వాడికి ఏమి లేకుండా చేస్తుంటే..
హృదయం కరగకున్నదా..
లేక శిల్పానివి కాబట్టి శిల గానే ఉండిపోయావా
హ..హా..హా...తెలిసిందిలే
ప్రాణమున్న ప్రతీది చస్తున్నది లేదా చంపబడుతున్నది అని
జీవం తో వస్తే..ఈ జీవులన్నీ నిన్ను అంతం చేస్తాయని
రాతిలో చేరి రంగ స్థలం చూస్తున్నావా
దేవుడా ఓ మంచి దేవుడా
నువ్వు.. అన్నది నిజమో కాదో అని
భిన్నంగా అడిగితే....
వాడ్ని నాస్తికుడు అంటున్నారు లేదా..
పూర్తిగా నాశనమే చేస్తున్నారు
నిన్ను శిలలో వెతికి శిల్పంగా మలిచి
నిన్ను పైన కూర్చోబెట్టిన మనిషికి లేని
మహోన్నత శక్తి...
రాతికో రూపం లా ఉండే నీకు ఉందని
నమ్ముతున్నాం చూడు...
దానికి మాకు మేమే సలామ్ చెప్పుకుంటున్నాం🙏🙏
.....రాజ్.....