భరోసా!
భరోసా!
వయసు పోరునాపలేక
తనువు తపన ఓపలేక
సొగసు భారం మోయలేక
హృదయ తాపం తాళలేక
కొంటె తుమ్మెదను వలచి
జుంటే తేనెలందించిన..
ఓ..జవ్వనీ
మధువు నందించిన మధురానుభూతి
మరువకముందే... భ్రమరమెగిరిపోయెనా
ఇది ఒక భ్రమ అని మది కుమిలిపోయేనా
మన చుట్టూ..
ఇలాంటి తుంటరి తుమ్మెదలెన్నో ఘాటు పెట్టిన
ఒంటరి గులాబీలెన్నో
వయసు పొంగులో
వలపు వలలో ..మనసు మాయ లో
కొంటె తుమ్మెదల మాయ మాటలో ..పడి
రేకులు చిదుముకొని..సొగసును నలుపుకొని
మోసపోయిన ..మగువలెందరో
మరి సమాజంగా నువ్వు ఇచ్చే భరోసా ఏమిటి?
సూటి పోటి
మాట లా
మొహం మీద చీదరింపులా
అదునుకోసం యెదురు చుపులా
సాయం చేసి..సరసాలా
ఏది ఏది భరోసా
ఆపదలో ఉన్నవారు
అసహాయ స్థితిలో ఉన్నవారు
ఆర్తి లో ఉన్న వారు
ఆవేదనలో ఉన్నవారు
ఎవరైనా అది ఎవ్వరైనా..
నీ వంతు భరోసా..
ఓ మంచి మాట..ఆత్మీయ పలకరింపు
చల్లటి చేతి స్పర్శ..చేతనైనా సహాయం
ఇది కదా..భరోసా
భరోసా నిస్తున్న ఎందరో..మహాను భావులకు..
మనఃపూర్వక అభినందనలు
ఇవ్వాలని నిర్ణయించుకున్న మరెందరో
ఉన్నతులకు..నా వందనాలు🙏🙏
.....రాజ్ తొర్లపాటి....