STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

మాతృ భాష 🙏

మాతృ భాష 🙏

1 min
388

మాతృ భాష

...........................

మాతృ ప్రేమ కి సాటి లేదు

మాతృ భాషకి పోటీ యే లేదు

అలలు వంటిది అన్య భాష

సాగర గర్భం మంటిది...మాతృ భాష

ఎగిరెగిరి పడేది పరభాష

నిర్మలంగా నిశ్చలంగా నీలోనే ఉండేది మన భాష

సాగర గర్భం లేనిదే అలలు లేవు

మాతృ భాష లేనిదే మనిషే లేడు 


అతివలో ఆడతనం..ఆలి లో అమ్మతనం

అమ్మలో కమ్మదనం అదే మన తెలుగు గొప్పతనం

గొప్పవాళ్ళ కే కాదు సామాన్యులకు సైతం

సంతసాన్నిచ్చే భాష మన తెలుగు భాష


అమ్మ చేతి వంటలా..ఆవకాయ పప్పు లా

చద్దన్నం ఉల్లిపాయలా..చంటి పాప నవ్వులా

ఎస్ వి ఆర్ నటన లా.. ఎన్ టి ఆర్ డైలాగు లా

ఘంటసాల గాత్రం లా..సాలూరి సంగీతం లా

ఆత్రేయ ఆత్మలా..వేటూరి పాట లా

శ్రీ శ్రీ పోటు లా..పరుచూరి మాట లా


నెచ్చెలి అలుగు లా..జాబిల్లి వెలుగు లా

పల్లెల్లో దొరికే స్వచ్ఛమైన జున్ను లా

చెట్టుకు ముగ్గిన మామిడి పండు లా

తండాల్లో దొరికే..తీయటి తేనె లా

అతి మధురమైనది...మాతృ భాష

అదే అదే..మన తెలుగు భాష


నేటి

అంతర్జాల సమాజం లో

అంతరిక్షపు సమాజం లో

యంత్రపు సమాజం లో

అంచలంచెలుగా ఎదగాలంటే

అన్య భాషల పరిజ్ఞానం అత్యవసరం

కానీ అమ్మ భాషని అనాధగా వదిలేయటం

అన్యాయం..అమానుషం

దీనికి సమాజం చెల్లించక తప్పదు భారీ మూల్యం


        .... రాజ్ తొర్లపాటి....



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Classics