STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

వినిపించని సంగీతం

వినిపించని సంగీతం

1 min
163

నీకోసం ఎదురుచూస్తూ 

ఒంటరిగా అలమటిస్తున్న 

నా నిర్వేదాన్ని పారదోలడానికేమో 

చంద్రుడులేని నీలాకాశం 

మినుకు మినుకు మంటున్న 

అశేష తారాగణం  

మెత్తగా ఒత్తుగా వీస్తూన్న 

సౌగంధిక వీచికలూ 

ఎగిసిపడి లేస్తూ 

హోరు పెడుతూన్న 

సముద్రపు అలలూ

దట్టమైన పొదల్లోంచి 

ఘోష పెడుతూన్న కీచు రాళ్ళూ 

ఎగురుతూ తనకు చేతనైన 

వెలుగులు నింపే 

ప్రయత్నం చేస్తూన్న 

వెలుగుల మిణుగురులూ 

గాఢమైన సుషుప్తిలో 

ఓలలాడుతూన్న ఈ జగత్తూ 

అన్నీ మనసుకి మాత్రమే 

వినిపించే సంగీతాన్నిస్తున్నాయి 

నువ్వు రావడమే తరువాయి 


Rate this content
Log in

Similar telugu poem from Abstract