STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Tragedy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Tragedy

శూన్య ఘోష

శూన్య ఘోష

1 min
336

 ఆరోజు అర్ధరాత్రి 

ప్రపంచం అంతా 

కలలు కూడా లేని 

ప్రగాఢ సుషుప్తి లో

ఓలలాడుతూంటే 

నేను మాత్రం 

ఒంటరిగా నా గదిలో 

నీ ఊహలతో 

విలవిలలాడుతూన్న వేళ

నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా 

నీ ఉనికిని గుర్తించాను 

పక్కకు తిరిగి చూస్తే 

అంతా శూన్యం 

ఈరోజు అర్ధరాత్రి 

నీ ఆలోచనలు 

చెదరగొట్టాలని 

నేను చేసే ప్రయత్నాలన్నీ 

నా గదిలో నీ ఉనికి

గుర్తించడంతో 

భగ్నమయ్యాయి 

తిరిగి చూస్తే 

అంతా శూన్యం 

నువ్వు నిజంగా 

నన్ను వదలలేక 

ఆత్మవై నా చుట్టూ 

తిరుగుతున్నావా

లేక నీ ప్రేమను 

మరచిపోలేక 

నేనే భ్రమల్లో 

విహరిస్తూన్నానా? 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract