ఆఖరి పిలుపు
ఆఖరి పిలుపు
ఈ నిలకడలేని ప్రపంచం తో
అలుపెరుగని పోరాటం చేసాక
ఇక నాదగ్గర మిగిలినవి
కొన్ని హృదయ ధ్వనులూ
కొన్ని ఉఛ్వాస నిశ్వాసాలూ
అవి పరిసమాప్తమయ్యేలోగా
నాకొక్కసారి దర్శనం ప్రసాదించు
నా తండ్రీ విరూపాక్షా
