ఒంటరి
ఒంటరి
కాలం ఆగి పోయింది
వీధి దీపం దీనంగా కొట్టుకుంటోంది
దూరంగా వీధి కుక్క ఏడుస్తోంది
నాలో ఏవో దురాలోచనలు
వాటి ఆగడాలను భరించలేక
నాలోంచి ఆత్మ బయటకు నెట్టబడింది
కసి, ఆక్రోశం, ఆవేశం, ఆశలతో
మురుగు కంపు కొడుతూన్న
నా పనికి రాని దేహాన్ని
ఆశ్చర్యంగా చూస్తోంది
ఒకప్పుడు నేను నివసించిన
దేవాలయం లాంటి ఈ దేహం
ఇవాళ ప్రపంచపు మెరుగులు కోసం
శిధిలమై చివికిపోతోందేమిటో
అని బాధపడుతూ
భరించలేని ఆత్మ మెల్లగా
తన దారి చూసుకుంటోంది
