విలువ
విలువ
ఒక జీవితం
కాలాధీనం గా గడిచిపోతుంది
మధ్యలో దొరికే స్వేచ్ఛ
జీవనానికి దొరికే వరం
ఆ వరాన్ని వాడుకోకుండా
కనపడని సంకెళ్ళ బంధాల్లో
ఎన్ని జన్మలు గడిపినా
జీవితానికి అర్ధం
వెతుకుతూనే ఉండాలి
మళ్ళీ మరో వందేళ్ల బతుకు
కొత్తగానే జీవించాలి !!!
