స్వేచ్చా స్వర్గం (గురుదేవ్ టాగోర్ పద్యానికి స్వేచ్చానువాదం)
స్వేచ్చా స్వర్గం (గురుదేవ్ టాగోర్ పద్యానికి స్వేచ్చానువాదం)
ఎక్కడైతే మనుషులు నిర్భీతితో తల ఎత్తుకుని నిటారుగా నిలబడతారో
ఎక్కడైతే జ్ఞానం నలుదిక్కుల నుంచీ వెల్లి విరిస్తూంటుందో
ఎక్కడైతే సమాజం సంకుచితమైన ఆలోచనలతో ముక్కలవదో
ఎక్కడైతే నిజం హృదయాంతరాళాల్లోంచి సూటిగా ప్రవహిస్తుందో
ఎక్కడైతే పరిపూర్ణత్వం కోసం అవిశ్రాంత తపన కనబడుతుందో
ఎక్కడైతే మానవతాభావన స్వచ్ఛమైన సెలయేరులా పరుగులు తీస్తూ అనాచారపు సంకెళ్లను పగులగొడుతుందో
ఎక్కడైతే మానవత్వపు ఎత్తులకు ఆలోచనలు సాగుతాయో
ఆ స్వేచ్చా స్వర్గానికి ఓ తండ్రీ నా దేశాన్ని మేలుకొలుపు
