STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Classics Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Classics Inspirational

జీవనయానం

జీవనయానం

1 min
321

ఈ ఒంటరి జీవన యానంలో 

అంతెరుగని కఠిన నిశీధి 

మనసంతా ఆవహించి

నీజీవితాన్ని దహించాలని 

జరిపే అభిచార హోమం 

ఒక సరికొత్త జీవనానికి 

మార్గదర్శనం చేసే అగ్నిహోత్రమై 

లయబద్దమైన అడుగులకై ఢమరుకమై 

సున్నితభావాలను కాచే వ్యాఘ్ర ఆచ్చాదనమై 

నీలోని అపస్మార రాక్షస అంశాలను 

మర్దనమొనరించే నటరాజ స్వరూపమై 

క్రొత్త వెలుగులకు సోపానమై 

నిటాలాక్షుడే నిన్నుగాచు వేళ


మార్కండేయుడవై 

మృత్యువునే ఎదిరించు 

ఆశలారిన ఎడారిలో 

అశ్రుతర్పణాలోసిగి 

కొత్తజీవం సృష్టించు 

నిన్నుదాటి సాముచేస్తున్న

కాలశ్వానికి కళ్లెం వేయి 

సమస్త అపస్మృతులను 

పారదోలే ఝటాఝూటమై 

జీవన యానం సాగించు 



Rate this content
Log in

Similar telugu poem from Classics