STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Fantasy

4  

Dinakar Reddy

Abstract Drama Fantasy

ఆకాశంలో సుమబాణం

ఆకాశంలో సుమబాణం

1 min
273

కదిలినది సఖీ

కాలము క్రొంగొత్త నదీ ప్రవాహమై

ఆటవిడుపు అద్భుత ద్వీపమైన చోట

నీలి రంగు ఆకాశంలో

నువ్వు సుమబాణంలా మెరిసి


వాదనల వేదనలు శిలలై

సప్త స్వరములు జలపాతములై

రెక్కల గుర్రములతో చుక్కలు పోటీ పడు చోట

అంతా నీ పేరే ఉంది

నీ అడుగులు మోపేందుకు ఆలస్యమా


అదుగో అటు చూడు

బంగారు పిచ్చుకల గూళ్ళు

ఇటేమో నెమళ్ళు నాట్యం చేసే పచ్చిక బయళ్ళు


అశాంతి లేని సాంత్వన పొందుతూ

చల్లని గాలి పల్లకీలో తుళ్లుతూ

నిన్ను నిన్నుగా పలకరించే ఆ చోట

ప్రకృతి రమణీయ మాలికగా

వనమున విరిసిన దేవ పుష్పముగా

నువ్వు విహరించి ఆడు


ఎవరి కౌగిల్లోనో ఒదిగితే తప్ప

సుఖం లేదనే వృథా తలపుల నుండి బయటపడు

ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి సిద్ధపడు


Rate this content
Log in

Similar telugu poem from Abstract