STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పంజరం

పంజరం

1 min
1.0K

నీరు ఎగువకు ప్రవహించినట్టు

సూర్యుడు దక్షిణాన ఉదయించినట్టు

నేను నిన్ను అనుసరించాను


వేల గొంతుకతో ప్రకృతి హెచ్చరిస్తున్నా

వసంతం ఆకులు రాల్చుతున్నా

విలయమైన నిన్ను ముద్దాడాను


విషము విషయమైన నీ ఇంటి తలుపులు

నీవే మృత్యువని తెలిపే ప్రమాద ఘంటికలు

ఎన్ని సార్లు మొత్తుకున్నా

నేను నీ వెంట అడుగేసాను


ఆత్మహత్యా సదృశమైన నీ మోహ పంజరములో చిక్కి

అహోరాత్రాలూ ప్రేమా ప్రేమా అని అరిచి

డస్సిపోయి పడుకున్నాను


నిద్రలో స్వేచ్ఛ కనిపించింది

బహుశా నేనిక నిద్ర లేవనేమో..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract