STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

అంత ఆశెందుకే మనసా

అంత ఆశెందుకే మనసా

1 min
316

ఏదో అయిపోవాలని

ఇంకా అనుకున్నది సాధించలేదని

ఎంత ఉస్సూరుమంటావ్

పోనీలే

ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అనుకోరాదూ


అసూయా గట్రా పడకు

కథలు ఎలాగూ పడతావ్

ఈ యవ్వారాలన్నీ చేస్కుంటా కింద పడద్దు


అయినా ఎందుకు అంత ఆశ నీకు

ఆశపడ్డం అంటే ఆశా చాక్లెట్ కొనుక్కు తినడం అనుకున్నావా

కష్టపడాలి

సూరీడు రాకముందే లేవాలి

సందురుణ్ణి సూడకండా పని చెయ్యాలి


మరి నచ్చత్రాలో

నా మనసు ఆగలేదు

ఆకాశం గుర్రుమంటూ చూసింది

నచ్చత్రాలు అన్నీ మూటగట్టి తీస్కబోతా అన్నావ్ కదా

అదేగా నీ ఆశ

మర్చిపోయావా మొద్దూ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract