మనసు లేని దేహం
మనసు లేని దేహం


అందని వాటికోసం ఆశపడి అలసిపోయాను...,
వెంటసాగలేక ఒంటరినై మిగిలిపోయాను...,
వెనకడుగు వేయలేక, గమ్యం చేరుకోలేక ఓడిపోయాను...,
చేరువకావాలని చెంతచేరాలని ఆశపడి సొలసిపోయాను...,
ఎదురుచూపులు ఎడారిలో నిలువ నీడలేక మోడై ఉన్నాను...,
తీరలేని ఆశల, మరువలేని బాసల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను...,
గతించిన గతం పీడకళలా బాధిస్తుంటే,
వెంటాడే వర్తమానం వీడని శాపంలా వేధిస్తుంది..,
శూన్యం అనే భవిష్యత్తు అంధకారమైంది..,
గేలి చేసిన గతాన్ని చూసి వెక్కిరిస్తున్న వర్తమానం నుండి శూన్యం అనే భవిష్యత్తులోకి అడుగుపెట్టే ఓ మనసు లేని దేహమా ఇదే నీకు నా వీడ్కోలు...!