నిద్రపోవాలి
నిద్రపోవాలి
బాగా నిద్రపోవాలి
అలారం మోత లేని నిద్ర
ఒత్తిడి లేని రోజు కోసం నిద్రపోవాలి
ఓ వైపు ప్రతి వారం కొత్త సినిమా
రోజూ ఓ కొత్త షో
అది చూడలేదా
అయ్యో ఇది కూడా చూడలేదా
ఏదో ఒకటి చూడు
ఇలాంటి కామెంట్స్ కి పోటీ పడుతూ
అర్థరాత్రి వరకూ స్మార్ట్ ఫోన్ వాడడం
ఆ మరుసటి రోజు ఆఫీసు మీటింగ్ లో ఆవులించడం
కుదిరితే వాష్ రూం లో కాసేపు కునుకు తీయడం
ఇవన్నీ ఆపేసి
నిద్రపోవాలి
బాగా నిద్రపోవాలి
ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన నిద్రను
నిద్రపోతూ ఆరాధించాలి
నిద్రా దేవత ఒడిలోకి జారిపోవాలి
మళ్లీ రేపు లేవాలండోయ్..
ఇప్పుడు నిద్ర పోవాలి..
గుర్ ర్ గుర్ ర్
