ఎరుగని హాయి
ఎరుగని హాయి


ప౹౹
ఎరుగని హాయి ఎదురుగనే నిలిచింది
తరగని వలపే ఆ తనువునే పిలిచింది ౹2౹
చ౹౹
ఎంత మధురం వెన్నెలలోని చల్లదనం
చెంత అధరం చేర్చగా అదో కొత్తదనం ౹2౹
తరిమే ఆ తరుణం అదే తపనగా కోరి
ఉరిమే ఊహలే ఉసికొలప పక్కనచేరి ౹ప౹
చ౹౹
తహతహలే తరిమిలే తననే తపనతో
అహఆహాలే ఒద్దికా చూపే ఉద్దీపనతో ౹2౹
ఎదనిండెనే ఎనలేని ఎలమితో ఓరిమి
మొదలిడినే మొగ్గతొడిగిన ఆ కూరిమి౹ప౹
చ౹౹
తరుణమే పెంచెగా మదిలో తన్మయం
వలపురణమే వదనంలో చేసె గాయం ౹2౹
చిన్ని ఆశ చిగురేసి షికారులే చేయగా
అన్ని ఊసులే విషయమే పంచేయగా ౹ప౹